నెలన్నర క్రితం నడక దారిలో కౌశిక్ అనే బాలుడిపై జరిగిన చిరుత దాడి గానీ, లక్షితపై జరిగిన చిరుత దాడి చేసిన చంపివేయడంపై అప్రమత్తం అయ్యాం.భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్య అటవీ శాఖ అధికారులతో సమావేశం అయ్యాం.
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి .మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించేది లేదు.రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి.
నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తాం.అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు వరకే అనుమతి..
భక్తుల ( Devotees )భధ్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖా సిబ్బందిని నియమించుకుంటాం.భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకున్నాం.
నడక, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటాం.నడక మార్గంలో ఉన్న హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు వేయకుండా నిరోధిస్తే చర్యలు తప్పదు.
దాదాపు ఐదు వందల ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తన్నాం.
అవసరం అయితే డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తాం.
అవసరం అయితే నడక దారిలో ఫొకస్ లైట్స్ ను ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం.ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ శాఖా అధికారుల నుండి సూచనలు తీసుకున్నాం.
కేంద్ర అటవీ శాఖ( Central Forest Department ) అధికారులకు ఫెన్సింగ్ ఏర్పాటుపై చర్చిస్తాం.అలిపిరి, ఏడోవ మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
అప్రమత్తత కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.భక్తుల ప్రాణరక్షణే ప్రధమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం.2007లో కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.15 వేల మందికి ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నాం.దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు ఏవిధంగా నైనా తిరుమలకు చేరుకోవచ్చు.వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టే వరకూ ఇదే నిబంధనలు అమలు చేస్తాం.వన్యప్రాణుల అధ్యాయనం కోసం అటవీ శాఖా అధికారులకు టిటిడి అన్ని విధాలుగా సహకరిస్తాం.ప్రతినిత్యం భక్తులు సురక్షితంగా తిరుమలకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.