అందరి ముందు ఆ కమెడియన్ పై చేయి చేసుకున్న వెంకటేష్.. అంత కోపం ఎందుకు బాసు?

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకటేష్ (Venkatesh) సంక్రాంతి పండుగ సందర్భంగా సైందవ్(Saindhav) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కానున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Hero Venkatesh Slaps Jabardasth Comedian In Sankranthi Special Show Details, Ven-TeluguStop.com

డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu)దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా విడుదల కాబోతున్నటువంటి తరుణంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈటీవీ వారు నిర్వహించినటువంటి అల్లుడా మజాకా(Alluda Majaka) అనే సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో పాల్గొన్నారు.

Telugu Alluda Majaka, Sudhakar, Kushboo, Meena, Saindhav, Sunami Sudhakar, Venka

ఈ కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్స్ మీనా (Meena ) కుష్బూ (Kushboo) పాల్గొని సందడి చేశారు.ఇక ఎప్పటిలాగే కమెడియన్స్ అందరూ కూడా తమ దైన శైలిలో తమ కామెడీ పంచ్ ల ద్వారా అందరిని నవ్వించారు.అయితే వెంకటేష్ కమెడియన్ పై చేయి చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.వెంకటేష్ ఘర్షణ మూవీలో ఏసీపీ రామచంద్ర గెటప్ వేశాడు.లోకల్ గ్యాంగ్ స్టర్ రోల్ ప్లే చేసిన సునామీ సుధాకర్( Sunami Sudhakar ) చెంప చెల్లుమనిపించాడు.సుధాకర్ రింగ రింగ రింగ రింగా సాంగ్ పాడాడు.

Telugu Alluda Majaka, Sudhakar, Kushboo, Meena, Saindhav, Sunami Sudhakar, Venka

సుధాకర్ ఈ పాటను పాడగానే వెంకటేష్ ఏంట్రా అది అని అడిగాడు.పాట అని నిర్లక్ష్యంగా సుధాకర్ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా వెంకటేష్ సుధాకర్ చంపపై చెల్లుమనిపించారు.ఇక పొట్టి నరేష్ తో మాట్లాడుతూ అసలు నిన్ను ఎక్కడ కొట్టాలిరా అంటూ తనదైన శైలిలో కామెడీకి పండించారు.అయితే ఇదంతా కూడా స్కిట్ లో భాగమేనని తెలుస్తోంది.

సాదరణంగా ఇలాంటి కార్యక్రమాలకు వెంకటేష్ హాజరు కారు కానీ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలా మొదటిసారి బుల్లితెర షోలో సందడి చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube