పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas )మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో ఈయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.ప్రజెంట్ ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టగా ఆ సినిమాలన్నీ వేగంగా షూటింగ్ జరుపు కుంటున్నాయి.
వీటిల్లో యంగ్ డైరెక్టర్ మారుతి( Director Maruthi ) దర్శకత్వంలో చేస్తున్న మూవీ ఒకటి.
ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.సినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాకపోయినా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టు టాక్.ఇప్పటి వరకు ఈ సినిమాకు డీలక్స్ రాజా, వింటేజ్ కింగ్, రాజా డీలక్స్ అనే పేర్లు వైరల్ అవుతున్న ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ నుండి లేదు.
ఎందుకో ఈ సినిమా షూట్ ను సైలెంట్ గానే ముగిస్తున్నారు.
ఇక ఇందులో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నట్టు టాక్.
అందులో మాళవిక మోహనన్,( Malavika Mohan ) నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) ను ఇప్పటికే ఫైనల్ చేయగా మరో ముద్దుగుమ్మ ఇంకా ఫిక్స్ కాలేదు.ఇప్పటికే ప్రభాస్ తో కొన్ని యాక్షన్ సీన్స్ ను పూర్తి చేసారు.
ఆయన లేని పార్ట్ షూట్ జరుగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి.ఒక ఫైట్ లో భాగంగా ప్రభాస్ విలన్స్ తో పోరాడుతున్న సీన్స్ కు సంబంధించిన రెండు పిక్స్ లీక్ అయ్యాయి.ఇటీవలే మాళవిక పిక్స్, చిన్న వీడియో లీక్ అయ్యింది.
ఇలా ఈ సినిమా నుండి లీక్స్ వస్తూనే ఉండడంతో మేకర్స్ ఈ విషయంలో సీరియస్ చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా అఫిషియల్ అప్డేట్స్ ను త్వరలోనే రివీల్ చేయనున్నట్టు సమాచారం.
కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ ( Thaman ) సంగీతం అందిస్తుండగా ఫుల్ కామెడీ జోన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.వచ్చే ఏడాది ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.