తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ వయసు పైపడుతున్న కొద్ది వరుస సినిమాలకు కమిట్ అవుతూ సినీ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ మరోవైపు అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇలా తన సినీ ప్రయాణంలో సరికొత్తకోణాన్ని చూపించిన బాలయ్య హోస్ట్ గా ఎంతో సక్సెస్ అయ్యారు.ఇలా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న తరుణంలోనే ఈయన కమర్షియల్ యాడ్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇలా తనలో విభిన్నమైన కోణాలని చూపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి బాలయ్య తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.కరోనా సమయంలో డిజిటల్ మీడియాకు మంచి ఆదరణ రావడంతో ఎంతోమంది సెలబ్రిటీలు వెబ్ సీరీస్ లో నటిస్తూ డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ సైతం డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న బాలకృష్ణతో ఒక వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇందుకు గాను బాలకృష్ణతో అల్లు అరవింద్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇందుకు గనుక బాలకృష్ణ ఓకే అంటే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనునట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బాలకృష్ణతో సమానమైనటువంటి వెంకటేశ్ సైతం రానానాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే బాలకృష్ణతో కూడా వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నట్టు సమాచారం.
ఇదే కనుక నిజమైతే అభిమానులకు ఇక పూనకాలే అని చెప్పాలి.ఇక బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా NBK 108 షూటింగ్ పనులు జరుపుకుంటుంది
.