బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏడి అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈడి సమన్లు రద్దు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేశారు.అదేవిధంగా మద్యం కుంభకోణంలో తన నివాసంలో గాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని తనను విచారణ చేయాలని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.
తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.కాగా ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మసనం రేపు విచారణ జరపనుంది.
మరోవైపు ఎమ్మెల్సీ కవితను వీడి అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించిన సంగతి తెలిసిందే.