తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ పంచాయతీ సుప్రీంకు చేరిన సంగతి తెలిసిందే.
సర్కార్ తీసుకొచ్చిన పది బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్ లో ఉంచారు.ఈ నేపథ్యంలో బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.