అదే పనిగా తన అన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jaga ) పై షర్మిల విమర్శలతో విరుచుకుపడుతున్నారు.ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన( TDP, Jana Sena ) కంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల చేస్తున్న రాజకీయ, వ్యక్తిగత విమర్శలు జగన్ కు డామేజ్ తీవ్రంగానే చేస్తున్నాయి.
దీంతో షర్మిల వెనుక చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల జగన్ టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు.ఇది ఇలా ఉంటే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణలో షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండ రాఘవరెడ్డి షర్మిల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది .షర్మిల ఒక విషం లాంటిది అని , తాను పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేసే అహంకారి అని , ఊసరవెల్లి లా రంగులు మారుస్తుందని కొండ విమర్శించారు .
జగన్ జైలులో ఉన్న సమయంలో విజయమ్మను పాదయాత్ర చేయమని కోరగా, షర్మిల( Sharmila ) జగన్ వద్దకు వెళ్లి తనంతట తానే పాదయాత్ర చేస్తానని చెప్పిందని, కానీ ఊసరవెల్లి రంగులు మార్చి నేనే అన్న కోసం పాదయాత్ర చేస్తున్నానని ,తన భర్త బ్రదర్ అనిల్ కుమార్( Brother Anil Kumar ) కు చెప్పకుండా పాదయాత్ర నిర్ణయం తీసుకున్నానని మీడియా ముందు చెప్పిందనే విషయాన్ని రాఘవరెడ్డి చెప్పుకొచ్చారు.షర్మిల తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని పార్టీ పెట్టిందని , అది అంతా జగన్ పై పగ తీర్చుకోవడానికి చేసిందని రాఘవరెడ్డి అన్నారు.తెలంగాణలో షర్మిల వల్ల , బ్రదర్ అనిల్ కుమార్ వల్ల చాలామంది నష్టపోయారని , కావాలంటే ఆధారాలతో సహా వెల్లడిస్తానని , బ్రదర్ అనిల్ కుమార్ కారణంగానే కుటుంబంలో విభాగాలు ఏర్పడ్డాయని రాఘవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది , ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో చేరింది కూడా జగన్ పై పగ తీర్చుకోవడానికేనని , జగన్ అధికారంలోకి వచ్చాక బ్రదర్ అనిల్ కుమార్ జగన్ ను కలిసి తన స్నేహితులు సతీష్ ,కొండలరావు, సుబ్బారావు కలిసి పెట్టిన ఓ కంపెనీ నుంచి ప్రభుత్వం ఎక్కువ ధరకు లావాదేవీలు జరపాలని కోరినట్లు రాఘవరెడ్డి వెల్లడించారు.దీనికి జగన్ ఒప్పుకోకపోవడంతోనే షర్మిల ఈ నిర్ణయం తీసుకుని జగన్ ను టార్గెట్ చేసుకున్నారని ,బ్రదర్ అనిల్ కుమార్ అతని స్నేహితులు వ్యాపారాల పేరుతో చాలామందిని ముంచారని ఈ విషయంపై విజయమ్మను సంప్రదించగా షర్మిల జగన్ మొండి అని తన మాట కూడా వినదని చెప్పినట్లుగా రాఘవరెడ్డి వెల్లడించారు.షర్మిల వెనుక బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు , టిడిపి అధినేత చంద్రబాబు లాంటి దుష్టశక్తులు ఉన్నాయని, తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భావం నుంచి స్క్రిప్ట్ పంపితే షర్మిల జగన్ పై విరుచుకు పడుతున్నారని, షర్మిల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవని , షర్మిల జగన్ పై చేస్తున్న అన్ని ప్రశ్నలకు తను వద్ద సమాధానాలు ఉన్నాయని రాఘవరెడ్డి తెలిపారు.