ఇది విన్నారా? ఇకనుండి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌!

ప్రపంచం నెంబర్ వన్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ పేమెంట్ వెరిఫికేషన్ మార్క్ కోసం యూజర్లకు ఛార్జీలు విధిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే.ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

 Have You Heard This Paid Subscription On Instagram From Now On, Instagram, Tech-TeluguStop.com

ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ టిక్ కోసం ఛార్జీలు ఇపుడు విధిస్తున్నారు.ఇకపోతే ఇన్‌స్టాగ్రామ్ ట్విటర్ దారిలోనే ఇకనుండి పయనించనుంది.

ట్విట్టర్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ కూడా బ్లూ బ్యాడ్జ్‌ ఛార్జీలను విధించాలని యోచిస్తోంది.ఇన్‌స్టాగ్రామ్ త్వరలో పేమెంట్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతుందని ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.

దీనికి సంబంధించి IG_NME_PAID_BLUE_BADGE_IDV, FB_NME_PAID_BLUE_BADGE_IDV వంటి స్ర్కీన్‌షాట్‌లను TechCrunch ద్వారా షేర్ చేసింది.

Telugu Paid, Latest, Micro Platm, Tech, Techcrunch-Latest News - Telugu

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రెండింటిలోనూ పేమెంట్ వెరిఫికేషన్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.Twitter ప్రస్తుతం వెరిఫికేషన్ బ్యాడ్జ్, ఇతర బెనిఫిట్స్ కలిగి ఉన్న బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లు ఛార్జ్ చేస్తోంది.అయితే iOS లేదా Android యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, జపాన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్‌లలో అందుబాటులో ఉంది.ప్రస్తుతానికి, మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ భారత మార్కెట్లో అదే ఫీచర్‌ను ఇంకా లాంచ్ చేయలేదు.

Telugu Paid, Latest, Micro Platm, Tech, Techcrunch-Latest News - Telugu

ఇక ఇన్‌స్టాగ్రామ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌కి కూడా ఛార్జీ విధిస్తే.ప్లాట్‌ఫారమ్‌లోని ఎవరైనా ట్విట్టర్ మాదిరిగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.అయితే ప్రస్తుతానికి, ఈ ఫీచర్‌పై పూర్తిగా క్లారిటీ లేదు.అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల క్యాండిడ్ స్టోరీస్ ఫీచర్‌ను ఇంకా టెస్టింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఈ ఫీచర్ BeReal యాప్‌లో ఉన్న కాన్సెప్ట్‌కి కాపీ అయినట్లు తెలుస్తోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్‌లతో పిక్చర్-పర్ఫెక్ట్ ఫొటోలు లేదా చిన్న వీడియోలను షేర్ చేసేందుకు ప్రయత్నిస్తారు.

ఈ ప్లాట్‌ఫారమ్ మరింత వాస్తవికంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.BeReal యాప్-ప్రేరేపిత ఫీచర్‌ను యాడ్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube