తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాయి.ఇక డిసెంబర్ 3న వెలువడే ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఎన్నికలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని బిఆర్‌ఎస్( BRS )చెబుతుంటే.ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడం పక్కా అని హస్తంనేతలు చెబుతున్నారు.దీంతో తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.
ఇక ఎన్నికల తరువాత విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు హస్తంపార్టీ వైపే మొగ్గు చూపాయి.దీంతో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడం గ్యారెంటీ అనే అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది.

అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు షేర్ పెరగడానికి టీడీపీ కూడా ఒక కారణమా ? అంటే అవుననే చెబుతున్నారు కొందరు రాజకీయవాదులు.ఈసారి తెలంగాణ ఎన్నికలను మొదట ప్రధానంగా తీసుకున్న టీడీపీ ఆ తరువాత ఎన్నికల ముందు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది.తెలంగాణలో టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది.హైదరబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి జిల్లాలో టీడీపీ మద్దతుదారుల సంఖ్య కాస్త ఎక్కువ.
టీడీపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ జిల్లాలోని టీడీపీ సానుభూతిపరులంతా కాంగ్రెస్ వైపే ముగ్గు చూపినట్లు కొందరి అంచనా.

ఎందుకంటే కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.పైగా తుమ్మల నాగేశ్వర రావు, భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka )వంటి వారు సైతం పరోక్షంగా టీడీపీకి మద్దతు పలుకుతూవచ్చారు.దాంతో టీడీపీ ఓటర్లంతా కాంగ్రెస్ వైపే మళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేసిఆర్ స్పందించిన తీరు కూడా టీడీపీ ఓటర్లను కాంగ్రెస్ కు దగ్గర చేసిందనేది కొందరి వాదన.చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడూ ధర్నాలకు, నిరసనలకు కేసిఆర్ అనుమతి ఇవ్వకపోవడం, ఆయా సందర్భాల్లో టీడీపీ ని కేసిఆర్ వ్యతిరేకించడంతో బిఆర్‌ఎస్ ప్రత్యామ్నాయంగా టీడీపీ ఓటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మొత్తానికి టీడీపీ ప్రభావంతో కాంగ్రెస్ లాభం పొందగా బిఆర్‌ఎస్ కు గట్టిగానే నష్టం జరిగిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట.