హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్( Haryana CM Manohar Lal Khattar ) రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ కు ఖట్టర్ సమర్పించారు.
ఖట్టర్ తో పాటు మంత్రివర్గం కూడా రాజీనామా చేసిందని తెలుస్తోంది.అయితే హర్యానా బీజేపీ – జేజేపీ( BJP-JJP ) ప్రభుత్వంలో విభేదాలు రావడంతో మనోహర్ లాల్ ఖట్టర్ మరియు మంత్రులు రాజీనామాలు చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే స్వతంత్రుల మద్ధతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
కాగా హర్యానా అసెంబ్లీలో( Haryana Assembly ) మొత్తం 90 స్థానాలు ఉండగా.40 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది.ఈ నేపథ్యంలోనే దుష్యంత్ చౌతాలా( Dushyant Chautala ) నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీతో( Jannayak Janata Party ) కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న సంగతి తెలిసిందే.
తాజాగా బీజేపీ -జేజేపీ ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది.