పనీర్( Paneer ) అనేది భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా శాఖాహార వంటకాల్లో బాగా వాడే ఒక రకమైన జున్ను.వెడ్డింగ్ మీల్స్ లో( Wedding Meal ) కూడా పనీర్ తప్పనిసరిగా ఉంటుంది.
అయితే, కొందరు వ్యక్తులు పనీర్ డిష్‌లు వడ్డించకపోతే తెగ డిసప్పాయింట్ అవుతారు.పెళ్లికి వచ్చాం కదా ఎలాగోలా తినేసి వెళ్ళిపోదాం అనుకుంటారు.
అలా సర్దుకునే వారు ఒక రకమైతే ఆహారం పెట్టలేదని అలిగి గొడవ పడేవారు మరొకరు.ఇటీవల కూడా ఓ పెళ్లి వేడుకలో భోజనంలో పనీర్ లేకపోవడంతో అతిథులు ఫైటింగ్ కి దిగారు.
వారికి పెళ్లి భోజనాలు పెట్టినవారికి మధ్య గొడవ జరిగింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ప్రజలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసరడం, మెడలు పట్టుకొని కొట్టుకోవడం వీడియోలో కనిపించింది.
పనీర్ లేని ‘మటర్ పనీర్’( Matar Paneer ) వంటకం పట్ల అసంతృప్తితో ఉన్న వధువు, వరుడి బంధువుల మధ్య ఈ గొడవ( Fight ) జరిగిందని వీడియో క్యాప్షన్ పేర్కొంది.వారు అతిథులను మంచిగా చూసుకో లేదని, భోజనాలు సరిగా పెట్టలేదని ఈ గొడవకు దిగారు.
ఒకరిపై ఒకరు దాడి చేయడం ద్వారా తమ నిరాశను బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఇంటర్నెట్ యూజర్లు ఈ వీడియోను సరదాగా ఫన్నీగా తీసుకున్నారు.వారు పనీర్ ప్రియుల గురించి జోకులు, మీమ్‌లు చేసారు.ఇష్టమైన జున్నుపై వారు ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తారేమో అని అన్నారు.
అతిథులు( Guests ) కుర్చీలు విరగ్గొట్టి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇండియన్ వెడ్డింగ్‌లో పనీర్ వధూవరుల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం ఇదే మొదటిసారి కాదు.గతంలో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగిన పెళ్లిలో పనీర్ కనిపించకపోవడంతో పనీర్‌ను ఏర్పాటు చేయని వధువు కుటుంబంతో వరుడు కుటుంబం కూడా పెట్టుకుంది.పనీర్ తినే హక్కు తనకు ఉందని, అది పరువు, ప్రతిష్టకు సంబంధించిన అంశమని వరుడు కుటుంబీకులు పేర్కొన్నారు.
ఈ గొడవలు చూస్తుంటే కొంతమంది భారతీయుల హృదయాలలో మనస్సులలో పనీర్‌కు ప్రత్యేక స్థానం ఉన్నట్లు అనిపిస్తుంది, వారు అది లేకుండా పెళ్లిని ఊహించలేరు.