Governor Tamilisai Soundararajan Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై..!!

దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి ఇటీవల కేంద్రం ప్రకటించడం తెలిసిందే.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు జనవరి 25వ తారీకు తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగాస్టార్ చిరంజీవికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu )కి అవార్డులు ప్రకటించడం జరిగింది.

 Governor Tamilisai Soundararajan Chiranjeevi : మెగాస్టార్ �-TeluguStop.com

కరోనా లాంటి కష్ట కాలంలో సినీ కార్మికులకు చేసిన సేవలను గుర్తించి చిరంజీవికి కేంద్రం ఈ అవార్డు ప్రకటించటం జరిగింది.ఈ క్రమంలో చాలామంది సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సినిమా ఇండస్ట్రీ( Film Industry )కి చెందిన చాలామంది దర్శకులు మరియు నిర్మాతలు చిరంజీవి నివాసానికి వెళ్లి గౌరవించడం జరిగింది.

తెలంగాణ మంత్రులు కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి సత్కరించారు.మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సత్కరించడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై( Telangana Governor Tamilisai Soundararajan ) దంపతులు రాజ్ భవన్ లో మెగాస్టార్ చిరంజీవిని సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి చిరంజీవి తన సతీమణి సురేఖతో కలసి హాజరయ్యారు.ఈ ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి.”నాకు ఆతిథ్యం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.తమిళిసై.

ఆమె భర్త సౌందరరాజన్ తో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉందని” చిరంజీవి రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube