అందరి దృష్టి గోషామహల్ పైనే ! బీఆర్ఎస్ కి పెద్ద తలనొప్పి 

తెలంగాణలో మరికొద్ది నెలలు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా దృష్టి సారించాయి.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

 Goshamahal Big Headache For Brs Brs, Telangana Government , Kcr, Telangana Ele-TeluguStop.com

ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా , కాంగ్రెస్ బిజెపిలు( Congress bjp ) ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.అయితే మూడు ప్రధాన పార్టీల్లోనూ కొన్ని కొన్ని నియోజకవర్గ విషయంలో తలనొప్పులు మొదలయ్యాయి.

ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గం విషయంలో ఈ పరిస్థితి తలెత్తింది.బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్( Rajasingh ) ప్రకటించారు.

Telugu Bjjp Mla, Goshamahal Bjp, Marati, Marvadi, Mla Rajasingh, Telangana-Polit

ఇక బీ ఆర్ ఎస్ ఈ నియోజకవర్గాన్ని మొదటి విడత జాబితాలో ప్రకటించకపోవడంతో, అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారు అనేది ఆసక్తికరంగా మారింది.లోకల్ , సెటిలర్స్ ప్రధానంగా పోటీ పడుతున్నారు.  సెటిలర్స్ అయిన నార్త్ ఇండియన్లలో రెండు వర్గాలు తమకు టికెట్ ఇవ్వాలి అంటే తమకు ఇవ్వాలంటూ పోటీ పడుతున్నాయి .ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న నందకిషోర్ వ్యాస్ బిలాలకు టికెట్ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా,  సెటిలర్స్ కు కాకుండా స్థానికులమైన తమకే టికెట్ కేటాయించాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ , ఆశీష్ కుమార్ యాదవ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.నార్త్ ఇండియన్ ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వారికే టికెట్ ఇస్తే గెలుస్తారనే అంచనాలో అన్ని పార్టీలు ఉన్నాయి.

Telugu Bjjp Mla, Goshamahal Bjp, Marati, Marvadi, Mla Rajasingh, Telangana-Polit

.ఆ నియోజకవర్గంలో మార్వాడీలకు బదులు తమ వర్గానికి టిక్కెట్ ఇవ్వాల్సిందిగా మరాఠీలు డిమాండ్ చేస్తున్నారు.గతంలో రెండు సార్లు మార్వాడీలకు సీటు ఇచ్చినా గెలవలేదని ,ఈసారి తమకు టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బీ ఆర్ ఎస్ ను జాతీయ రాజకీయాల్లో కీలకం  చేసేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తూ ఉండడం,  మహారాష్ట్ర పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, గోషా మహల్ టికెట్ విషయంలో మరాఠీలకు ప్రాధాన్యం ఇస్తే , రాష్ట్రంలోనూ, దేశంలోనూ రెండు చోట్ల బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని కేసీఆర్( CM kcr ) అంచనా వేస్తున్నారు.తమ సామాజిక వర్గానికి చెందిన దిలీప్ ఘనాటే కు టిక్కెట్ ఇవ్వాలని మరాఠీ సంఘాల నేతలు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కొంతమంది మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ నియోజకవర్గ టికెట్ కేటాయింపు అంశం కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube