దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్వాం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇటీవల అరెస్ట్ అయిన సీఏ గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.
దీంతో గోరంట్లను రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట అధికారులు హాజరుపరిచారు.కేసు దర్యాప్తు పురోగతిని వివరించిన సీబీఐ కస్టడీని పొడిగించాలని కోరింది.
ఈ నేపథ్యంలో సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది.అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.