ఇటీవల అంబర్ పేట్ కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ ఘటన అందర్నీ తీవ్రంగా కలిసి వేసింది.
తాజాగా ఈ ఘటన పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.మేయర్ పై మండిపడడంతో పాటు మేయర్ ని కుక్కల మధ్యలో వదిలేయాలి అంటూ కోపంగా వాఖ్యలు చేశారు.
ప్రముఖ టీవీ ఛానల్ కుక్కల దాడి ఘటన పై ఒక డిబేట్ నిర్వహించింది.ఈ డిబేట్లో రాంగోపాల్ వర్మ పాల్గొన్నారు.
బాలుడు మృతి విషయంలో ఎవరు బాధ్యులు అనే అంశం మీద చర్చ పెట్టగా ఆ చర్చలో వర్మతో పాటు బాధితులు జంతి ప్రేమికులు మేయర్ అలాగే మద్దతు దారులు కూడా పాల్గొన్నారు.

కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం పై తప్పు ఎవరిది అన్న ప్రశ్నపై చర్చలు నడుస్తున్న సమయంలో జంతు ప్రేమికులు ఇది పూర్తిగా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అని స్టేట్మెంట్ ఇచ్చారు.పిల్లవాడిని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిదండ్రులు తప్పు అని జంతు ప్రేమికులు అనడంతో వెంటనే బాధితులు జంతు ప్రేమికుల పై సీరియస్ అయ్యారు.తల్లిదండ్రులు కావాలనే పిల్లల్ని కుక్కల దగ్గర పడేస్తారా కొంచెం కూడా మానవత్వం లేకపోతే ఎలా అని మండిపడ్డారు.
జంతు ప్రేమికుల కామెంట్స్ పట్ల పిల్లాడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం వర్మ మాట్లాడుతూ జంతు ప్రేమికుల పై మండిపడ్డారు.

కొడుకు పోయిన బాధలో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి కోపంగా మాట్లాడటం అనేది వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళది అసలు తప్పే లేదు.మేయర్ ని ప్రాజెక్టు చేయాల్సింది పోయి తప్పుని తల్లిదండ్రుల మీద చూస్తారేంటి అని వర్మ మండిపడ్డాడు.అయితే ఈ డిబేట్లోకి తనను ఎందుకు పిలిచారో బాధితులను ఎందుకు పిలిచారో జంతు ప్రేమికులను ఎందుకు పిలిచారు అన్నది తెలియదు కానీ దీనికి ఒకటే సొల్యూషన్ వాళ్ళనైనా పొమ్మనండి లేదా, నేనైనా వెళ్ళిపోతాను సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా అక్కడున్న కొందరు రాంగోపాల్ వర్మ అని అడ్డుకొని అక్కడ ఉండమని చెప్పారు.వర్మ ఎప్పుడూ కూడా ఈ విధంగా సీరియస్ అవ్వలేదు.
లాంటిది మొదటిసారి లైవ్ అలా డిబేట్లో కూర్చున్నప్పుడు నియర్ మద్దతు ధరలపై సీరియస్ అవ్వడంతో పాటు డిబేట్ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేశారు.ఎప్పుడు మానవత్వం లేదు అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ మొదటిసారి మానవత్వాన్ని ప్రదర్శిస్తుండగా నెటిజన్స్ కూడా రాంగోపాల్ వర్మ కి సపోర్ట్ చేస్తున్నారు.







