విజయనగరం రైల్వే స్టేషన్ లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.పార్కింగ్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్ కు ట్రైన్ మారుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఆ పట్టాలపై వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది.
దీంతో రైలు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వెంటనే స్పందించిన రైల్వే అధికారులు హుటాహుటిన మరమ్మత్తు పనులు చేపట్టి రైల్వే ట్రాక్ ను క్లియర్ చేశారు.