నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) అమెరికాకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
జూన్ 21 నుంచి 24 మధ్య తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండు డజన్ల మంది ప్రముఖులను కలవనున్నారు.వీరిలో నోబెల్ అవార్డ్ గ్రహీతలు, ఆర్ధిక వేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు, ఆరోగ్యరంగ నిపుణులు వున్నారు.
అలాగే వీరిలో భారత సంతికి చెందిన వ్యాపారవేత్త, సంగీత విద్వాంసురాలు చంద్రిక టాండన్( Chandrika Tandon ) కూడా వున్నారు.ఆమె ఎవరో కాదు.పెప్సికో మాజీ ఛైర్మన్ అండ్ సీఈవో ఇంద్రా నూయికి ( Indra Nuiki )స్వయానా సోదరి.అయితే ఇంద్రా మాదిరిగా కేవలం వ్యాపారాలకే పరిమితం కాకుండా సామాజిక సేవతో పాటు సంగీతం , కళల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు చంద్రిక.
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.చంద్రిక , ఆమె భర్త రంజన్ టాండన్‌లు( Ranjan Tandons ) న్యూయార్క్‌లో మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు.
చంద్రికా కృష్ణమూర్తిగా జన్మించిన ఆమె .తన సోదరి ఇంద్రా నూయితో కలిసి చెన్నైలో పెరిగారు.హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.అనంతరం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ, ఐఐఎం అహ్మదాబాద్‌లో పట్టభద్రురాలైంది.న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డైరెక్టర్ల బోర్డు సభ్యురాలిగా, బెర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కౌన్సిల్‌లోనూ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.అంతేకాదు .నాలుగు మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా విడుదల చేసి గ్రామీ అవార్డ్‌కు నామినేషన్‌ను సైతం సంపాదించారు.
లాభాపేక్షలేని సంగీత సంస్థ సోల్ చాంట్స్ మ్యూజిక్‌ను కూడా చంద్రిక నడుపుతున్నారు.అమెరికన్ ఇండియా ఫౌండేషన్‌కు ట్రస్టీగానూ వ్యవహరిస్తున్నారు.2015లో టాండన్, ఆమె భర్త రంజన్‌లు న్యూయార్క్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగం అభివృద్ధి కోసం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.దీనికి గుర్తింపుగా ఎన్‌వైయూ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టి ఈ దంపతులను గౌరవించారు.1992లో స్థాపించిన ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ అయిన టాండన్ క్యాపిటల్ అసోసియేట్స్‌కు చైర్‌గానూ చంద్రిక వున్నారు.