యోగా ప్రాముఖ్యత గురించి, దానిని చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ( International Day of Yoga )నిర్వహిస్తూ ఉన్నారు.అయితే భారతీయుల కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకున్నారు.
అయితే యోగ అనేది మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం కోసం సహాయపడుతుంది.వ్యాయామాలు చేసే సమయంలో శరీరంలో ఎలాగైతే ఉష్ణోగ్రత పెరుగుతుందో అదే విధంగా యోగా చేసినప్పుడు కూడా పెరుగుతుంది.
ఇక వాతావరణ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం వేడెక్కి దాహం వేస్తుంది.అయితే ఆ సమయంలో నీరు తాగవచ్చ? ఒకవేళ తాగితే ఎలా తాగాలి? లాంటి కీలక వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎలాంటి శారీరక శ్రమ చేసినా కూడా దాహం వేస్తుంది.అయితే చాలామంది వ్యాయామం, యోగ చేసే సమయంలో నీరు తాగితే ఆరోగ్యం పాడవుతుందని భావిస్తూ ఉంటారు.కానీ అది వాస్తవం కాదనీ నిపుణులు చెబుతున్నారు.యోగా చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నీళ్లు తాగవచ్చని చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేటెడ్( hydrated ) గా ఉంటుంది.అలాగే శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది.
యోగ చేసే సమయంలో చాలామంది నీళ్లు తాగరు.అయితే శరీరాకృతిని బట్టి చిట్కాలు పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో యోగా చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీళ్లు తాగాలి.
యోగ సమయం లో చల్లని నీళ్లను అస్సలు తాగకూడదు.చల్లని నీళ్లను తాగడం వలన హృదయ స్పందన ప్రభావితం చేస్తుంది.అందుకే సాధారణ నీటిని తాగడమే మంచిది.యోగా, వ్యాయామం చేసిన వెంటనే నీళ్లు తాగొద్దు.యోగా, వ్యాయామం( Exercise ) కారణంగా శరీరం వేడెక్కుతుంది.అలాంటి సమయంలో హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా నీళ్లు తాగడం వలన గుండెపోటు( Heart attack ), స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.ఇక సాధారణ నీటిలో చల్లని నీరు కలిపి తాగడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
దీనికి బదులుగా కుండలో నీటిని తాగడం మంచిది.