పబ్ జి ప్రియులకు శుభవార్త.. మళ్లీ రానుందట!

గత కొద్ది నెలల వరకు మన దేశంలో పబ్ జి ఆన్లైన్ ఆటకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది.స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటకు బానిసైపోయారు.

 Pub G, Airtel, China Apps, Tenants Game-TeluguStop.com

ఎంతగా అంటే చివరకు ప్రాణాలు తీసుకునే అంతగా బానిసలై పోయారు.అంతేకాకుండా ఈ ఆట ఆడడం వల్ల ఎంతోమంది తీవ్ర అనారోగ్య సమస్యలతో కూడా బాధ పడ్డారు.

వినియోగదారుల డేటాను వేరే దేశాలకు పంపుతూ, మన దేశ భద్రతకు సమస్యగా మారుతుందని భావించిన మనదేశం పబ్ జి ఆటతో పాటు మరో 117 చైనా యాప్ లను రద్దు చేసిన విషయం తెలిసినదే.

దీంతో ఎంతో మంది పబ్ జి ప్రియులు నిరాశకు గురయ్యారు.

అయితే ఇలాంటి వారికి త్వరలో ఎయిర్టెల్ కంపెనీ ఒక శుభవార్త చెప్పనుంది. పబ్ జి కార్పొరేషన్ సంస్థ భారత దేశంలో ఈ ఆటను డిస్ట్రిబ్యూట్ చేయడానికి గాను, అంతకుముందే ఒప్పందం చేసుకున్న టెన్సెంట్ గేమ్స్ తో ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది.

అయితే అప్పటి నుంచి భారత దేశంలో ఈ ఆట ఎలాంటి పరిస్థితుల్లో కూడా లీగల్ గా ఎంటర్ కాలేదు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం,ఈ ఆట మళ్లీ భారతదేశంలోకి లాంఛనంగా విడుదల చేయనున్నట్లు, సమాచారం.

పబ్ జి కార్పొరేషన్ సంస్థ ప్రముఖ ఎయిర్టెల్ కంపెనీతో చర్చలు జరుపుతోంది.అంతేకాకుండా ఈ కార్పొరేషన్ సంస్థ ఒక టీమ్ ని కూడా సిద్ధం చేసింది.అందుకు గాను వారికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేస్తోంది.

అయితే పబ్ జి కార్పొరేషన్ సంస్థ ప్రముఖ ఎయిర్టెల్ కంపెనీ తో జరిపిన చర్చలు ను అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో ఈ ఆట మనదేశంలో ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో చెప్పలేం.

కానీ ఈ రెండు ప్రముఖ సంస్థలు జరిపిన చర్చలను ధృవీకరించినట్లయితే, మన దేశంలో తిరిగి పబ్ జి అధికారికంగా తిరిగి ప్రారంభం కానుంది.ఏది ఏమైనా త్వరలోనే పబ్ జి ప్రియులకు శుభవార్త అందనుందనేది ఈ వార్త ద్వారా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube