సినిమాకు 100 టికెట్స్ కావాలి.. థియేటర్ కు లేఖ రాసిన మేయర్.. షాక్ అవుతున్న నెటిజెన్స్..

టాలీవుడ్ పరిశ్రమలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి.ఎప్పుడు ఏదొక విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది.

 Give 100 Tickets To The Movie Vijayawada Mayor Letter To Theatres Details, Tolly-TeluguStop.com

ఇది కొత్తేమి కాదు.మొన్నటి వరకు టాలీవుడ్ టికెట్ రేట్ల విషయంపై వివాదాలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ సినిమా వివాదం రోజురోజుకూ మరింత ముదరడంతో చిరంజీవి పెద్దగా కలుగజేసుకుని ఈ వివాదానికి ఒక పరిష్కారాన్ని చూపించారు.

అయితే మొన్న భీమ్లా నాయక్ సినిమా వరకు ఈ వివాదం సర్దుమణగ లేదు.

జగన్ సర్కారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినట్టు ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉన్నారు.ఇక ఈ రోజు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ అవ్వడానికి ముందు ఈ టికెట్ వ్యవహారంలో కొత్త జీవో జారీ చేసారు.

దీంతో పవన్ ఫ్యాన్స్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

ఇది పక్కన పెడితే తాజాగా మరొక ఇష్యు తెరమీదకు వచ్చింది.

Telugu Tickets, Ap Cm Jagan, Bheemla Nayak, Mayor Letter, Pawan Kalyan, Radhe Sh

విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి రాసిన ఒక లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.విజయవాడలో విడుదల అయ్యే ప్రతి సినిమాకు ప్రతి షోకు 100 టికెట్స్ ఇవ్వాలని ఈమె లేఖ రాయడంతో అందరు షాక్ అవుతున్నారు.రాజకీయ నేతలు కూడా ఇలా సినిమాల కోసం లేఖలు రాయడం ఇదే మొదటిసారి.

Telugu Tickets, Ap Cm Jagan, Bheemla Nayak, Mayor Letter, Pawan Kalyan, Radhe Sh

అయితే ఆ 100 టికెట్స్ కు మేమే డబ్బులు చెల్లిస్తామని కూడా ఆమె చెబుతుంది.కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధుల నుండి వస్తున్న డిమాండ్ ల మేరకే ఇలా టికెట్స్ కావాలని అడుగుతున్నట్టు తెలుస్తుంది.దీంతో ఇప్పుడు రాజకీయ నాయకులూ కూడా సినిమా టికెట్స్ కావాలని కోరడంతో వీరు కూడా వినోదానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే మరికొంత మంది మాత్రం ప్రజల సమస్యలపై లేఖ రాయాల్సింది పోయి ఇలా సినిమా టికెట్స్ కోసం లేఖ రాయడం ముందు ముందు దేనికి దారి తీస్తుందో అని అంతా భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube