ఫన్ టాస్టిక్ సండే: సెప్టెంబర్ 18న లేడీస్ జెంటిల్మెన్ షో లాంచ్ మరియు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, మీ జీ తెలుగులో

హైదరాబాద్, 14th సెప్టెంబర్, 2022: వినోదాత్మకమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్, షోస్ తో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న ‘జీ తెలుగు’ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకువస్తూ వారి మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ముగిసిన ‘జీ సూపర్ ఫామిలీ‘ షోకి దీటుగా ఇప్పుడు ‘లేడీస్ & జెంటిల్మెన్’ అనే మరో ఎంటర్టైనింగ్ షోని సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది.

 ‘fun’tastic Sunday Ahead As Zee Telugu Set For The Launch Of ‘ladies Gent-TeluguStop.com

ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రతివారం ముగ్గురు సరికొత్త సెలబ్రిటీ కపుల్స్ లేదా ఫ్రెండ్షిప్ జోడీలు తరలివచ్చి వీక్షకులను అలరించనున్నారు.అంతేకాదు, ఈ ఆదివారం రెట్టింపు వినోదాన్ని పంచడానికి మరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ని — ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’  — సాయంత్రం 6 గంటలకు ప్రజల ముందుకు తీసుకురానుంది ‘జీ తెలుగు’.‘లేడీస్ & జెంటిల్మెన్’ మొదటి ఎపిసోడ్లో భాగంగా సెలబ్రిటీ కపుల్స్ అలీ- జుబేదా, మనో-జాలీమా, మరియు బాబా భాస్కర్-రేవతి మూడు ఫన్నీ రౌండ్లలో తలపడి సందడి చేయనున్నారు.

అదేవిధంగా, ఈ సెలబ్రిటీ కపుల్స్ ప్రదీప్ ని పెళ్లి విషయంలో ఏడిపించిన విధానం మరియు అతనికి వారు ఇచ్చిన టిప్స్ అందరిని నవ్వించనున్నాయి.‘లేడీస్ & జెంటిల్మెన్’ తో 90 నిమిషాల ప్యూర్ ఎంటర్టైన్మెంట్ తరవాత ఈ డోస్ ని మరి కాస్త పెంచుతూ సాయంత్రం 6 గంటలకు ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’ వరల్డ్టె లివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ (వెంకీ), వరుణ్ తేజ్ (వరుణ్), తమన్నా భాటియా (హారిక), మరియు మెహ్రీన్ పిర్జాదా (హనీ) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ కుటుంబ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

కథ విషయానికొస్తే, వెంకీ, వరుణ్, హారిక-హనీ & ఫ్యామిలీ ఒక వ్యాపారవేత్తను మోసం చేసి రాత్రికిరాత్రి కోటీశ్వరులు అవ్వాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు.మరి ఆ ప్రయత్నంలో ఎవరు విజయం సాధిస్తారు, ఈ ప్రయాణంలో వారు ఏం తెలుసుకుంటారో తెలియాలంటే ఈ ఆదివారం నాడు ‘F3’ సినిమాను జీ తెలుగులో వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube