జాతిరత్నాలు సినిమా తో సూపర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు అనుదీప్ కథ ను అందించగా.అదే జాతిరత్నాలు సినిమాకు అసిస్టెంట్ దర్శకుడుగా వ్యవహరించిన వంశీధర్ గౌడ్ దర్శకుడిగా మారి దర్శకత్వం వహించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో.
ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.ముఖ్యంగా అల్లు అరవింద్, వెన్నెల కిషోర్ లతో చేసిన ఫన్నీ వీడియోలు సినిమా గురించి సామాన్య జనాల్లో కూడా చర్చ జరిగేలా చేసింది.
పెద్ద ఎత్తున సినిమా కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా లో వచ్చాయి.ఇక చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం లో పాల్గొనడం తో సినిమా కు మరింత హైప్ క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు.
సినిమా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ఒక కుర్రాడు తన ప్రేయసికి పవన్ కళ్యాణ్ సినిమా అయిన ఖుషి ని మొదటి రోజు మొదటి ఆట చూపించాలని కోరుకుంటాడు.
అందుకోసం ఎన్ని కష్టాలు పడ్డాడు.ఎంతగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది కథ.సింపుల్ పాయింట్ అయినా కూడా అనుదీప్ కచ్చితంగా ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడని అంత భావించారు.కానీ అనుభవంగా సినిమా నిరాశ పర్చింది.
థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం మూడు వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆహాలో ఈనెల 23 వ తారీఖున స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇటీవలే తెలుగు సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత కానీ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా విడుదల చేయవద్దంటూ నిర్మాతలు నిర్ణయించారు.అయినా కూడా ఈ సినిమా కు ఆ రూల్ వర్తించేటట్లు లేదు.
తాజాగా అధికారిక ప్రకటన రావడంతో ప్రేక్షకులు 23వ తారీఖున ఈ సినిమాను ఎలా ఉందో చూద్దాం అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా ఒక వారం ముందే అధికారికంగా ప్రకటన వచ్చేసింది.
మరి ఆహా లో అయినా ఈ సినిమా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.