ఏప్రిల్ 13వ తారీకు విజయవాడ సింగ్ నగర్ వద్ద సీఎం జగన్ పై( CM Jagan ) రాయి దాడి జరగటం తెలిసిందే.ఈ ఘటనలో నిందితుడిని ఈనెల 17వ తారీకు పోలీసులు పట్టుకోవడం జరిగింది.
వేముల సతీష్( Vemula Satish ) అనే వ్యక్తి.జగన్ మీద దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
దీంతో ఈ కేసులో నిందితుడు వేముల సతీష్ ని.విజయవాడ పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
పోలీసులు పేర్కొన్న పుట్టిన తేదీ వివరాలకు అతని… ఆధార్ కార్డులో ఉన్న తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ క్రమంలో నిందితుడి ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అంతేకాదు నిందితుడికి నేరచరిత్ర కూడా లేదని పేర్కొన్నారు.
రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెట్టారని వాదనలు వినిపించారు.ఈ క్రమంలో పోలీసుల తరపు న్యాయవాది స్పందిస్తూ… నిందితుడు దురుద్దేశపూర్వకంగానే రాయి దాడి( Stone Attack ) చేయటం జరిగిందని ఆరోపించారు.
ఇటువంటి పరిస్థితులలో హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న విజయవాడ కోర్ట్( Vijayawada Court ) సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది.
దీంతో నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.