ఏపీ సీఎం జగన్ పై దాడి నిందితుడికి 14 రోజుల రిమాండ్..!!

ఏప్రిల్ 13వ తారీకు విజయవాడ సింగ్ నగర్ వద్ద సీఎం జగన్ పై( CM Jagan ) రాయి దాడి జరగటం తెలిసిందే.

ఈ ఘటనలో నిందితుడిని ఈనెల 17వ తారీకు పోలీసులు పట్టుకోవడం జరిగింది.వేముల సతీష్( Vemula Satish ) అనే వ్యక్తి.

జగన్ మీద దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.దీంతో ఈ కేసులో నిందితుడు వేముల సతీష్ ని.

విజయవాడ పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

"""/" / పోలీసులు పేర్కొన్న పుట్టిన తేదీ వివరాలకు అతని.ఆధార్ కార్డులో ఉన్న తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో నిందితుడి ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు నిందితుడికి నేరచరిత్ర కూడా లేదని పేర్కొన్నారు.రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెట్టారని వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో పోలీసుల తరపు న్యాయవాది స్పందిస్తూ.నిందితుడు దురుద్దేశపూర్వకంగానే రాయి దాడి( Stone Attack ) చేయటం జరిగిందని ఆరోపించారు.

ఇటువంటి పరిస్థితులలో హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న విజయవాడ కోర్ట్( Vijayawada Court ) సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది.

దీంతో నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.

వార్ 2 సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న కన్నడ స్టార్ హీరో…