సీనియర్ నటి, టిడిపి పార్టీ మాజీ అధికార ప్రతినిధి అయినా దివ్యవాణి ఇటీవల టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.టిడిపి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎన్నో విషయాలను భయపడకుండా బయటపెడుతోంది.
టీడీపీ పార్టీలో చంద్రబాబు, లోకేష్ బాబులు మంచి వాళ్లే అయినా ఆయన చుట్టూ ఉన్న పెద్దలు పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని వాళ్ల బండారాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతోంది దివ్యవాణి.తాజాగా టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దివ్యవాణి.
టీడీ జనార్థన్ రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే.టీడీపీ పార్టీ టీడీజే పార్టీగా మారబోతుందంటూ జోస్యం చెప్పింది దివ్యవాణి.
తాజాగా మరొక వీడియోని విడుదల చేసిన దివ్యవాణి చంద్రబాబు లోకేష్ ని రిక్వెస్ట్ చేస్తూ ఎంతో ప్రేమతో గౌరవంతో చంద్రబాబు గారి దగ్గర వర్క చేయాలని ఆ పార్టీలో జాయిన్ అయ్యానని కానీ కొన్ని అనివార్య కారణాలతో పార్టీ నుంచి బయటకు వచ్చేశానని అయితే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత పనికిమాలిన ప్రతి చెత్త వెధవ నా గురించి మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు దివ్యవాణి. తాను ఇప్పటివరకూ టీడీపీ పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మాట్లాడుతున్నానని, నేను జగన్ గారి కోవర్టునని ముద్ర వేసినప్పుడు నేను కోవర్ట్‌ని కాదు అని చెప్పడానికి కొన్ని ఆధారాలను బయటపెట్టడం జరిగింది.
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు గారికి,లోకేష్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే.

నిజానిజాలు మీకు తెలియాలనే నేను అన్నీ బయటకు తీస్తున్నా తప్పితే.మాపై నిందలు వేయించుకోవడానికి కాదు.దయచేసి ఇలాంటి చెత్త వెధవల్ని కంట్రోల్ చేయండి.
నీతి నియమాలతో పనిచేసిన వాళ్లపై నిందలు వేయడం భావ్యం కాదు.నేను పార్టీలో ఉన్నప్పుడు హింసపెట్టారు.
పార్టీ వదిలి బయటకు వచ్చేసిన తరువాత కూడా హింస పెడుతున్నారని నిజాలు బయటకు వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.కాబట్టి టీడీ జనార్ధన్ అండ్ కో వాళ్లకి చెప్పేది ఏంటంటే.
మీరు అధిష్టానానికి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో కానీ.ఇలాంటి కోవర్టులంతా మాపై చేసే కామెంట్స్‌ని స్టాప్ చేయాలని కోరుతున్నా.
ఇప్పటికైనా సమీక్షించుకోండి.పార్టీ కోసం పనిచేసేవాళ్లకి న్యాయం చేయండి దివ్యవాణి.