బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ బాలసాని రాజీనామా..!

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.

 Former Mlc Balasani Resigned From Brs Party..!-TeluguStop.com

ఇటీవలే భద్రాచలం బీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి బాలసానిని పార్టీ అధిష్టానం తప్పించిందని తెలుస్తోంది.దీంతో పార్టీ తీరుపై బాలసాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.

ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలసాని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube