తెలంగాణలో రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ ఎస్ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్.కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారా? ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయాల నేపథ్యంలో ఆయన తన వ్యూహాన్ని వడివడిగా అమలు చేయాలని చూస్తున్నారా? ప్రస్తుతం తన కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో కొందరి పనితీరుపై ఆయన గుస్సాగా ఉన్నారా? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.రాజకీయాలు ఎప్పుడూ ఒకే లా ఉండవు.ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.అయితే.
అధికారంలో ఉన్న పార్టీకి ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది.సో.ఎప్పటికప్పుడు.ఆయా పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది.
కానీ, టీఆర్ ఎస్‌లో ఉన్న నాయకులు మాత్రం ఆదిశగా అడుగులు వేయడం లేదని.సొంత లాభాలు, ఆధిపత్య పోరుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో మంత్రులు మరింత దూకుడు చూపుతున్నారని.
కేడర్‌ను బలోపేతం చేయడంలో కూడా విఫలమవుతు న్నారని కేసీఆర్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా సంకేతాలు వస్తున్నాయి.ఇదిలావుంటే, ఇటీవల రాష్ట్రంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ఊహించిన దానికి, వచ్చిన ఫలితానికి సంబంధం లేకుండా పోయింది.
అసలు ఏమీ లేదనుకున్న బీజేపీ పుంజుకుంది.దుబ్బాకలో ఏకంగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా విజయం సాధించింది.ఇక, గ్రేటర్‌లో దూకుడు మామూలుగా లేదు.దీంతో దీనికి కారణాలను అన్వేషించిన కేసీఆర్.మంత్రివర్గం లో లోటుపాట్లు ఉన్నాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.అంతేకాదు.
పార్టీ వ్యవహారాలలో సీనియర్లు ఆశించిన విధంగా పనిచేయడం లేదని కూడా భావిస్తున్నారు.అదేవిధంగా లెక్కకు మిక్కిలిగా ఉన్న అధికార ప్రతినిధుల పనితీరుపై కూడా కేసీఆర్ అసహనంతో ఉన్నారు.
ఈ క్రమంలో మంత్రులను మార్చేందుకు, అధికార ప్రతినిధులుగా యువతను నియమించేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు.మొత్తంగా మల్లారెడ్డి సహా ఐదుగురు మంత్రులను పక్కకు తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దీంతో త్వరలో జమిలి వచ్చే అవకాశం ఉన్నందున పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రయత్నాలుప్రారంభించారని చెబుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.