మేడ్చల్ జిల్లా ఉప్పల్ దగ్గర ప్రమాదం జరిగింది.డీసీఎం వ్యాన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లో వాహనం మొత్తం మంటలు వ్యాపించడంతో డీసీఎం పూర్తిగా కాలిపోయింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహారించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.డీసీఎంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.