ఆర్ఆర్ఆర్ అవార్డు వేడుకలలో కనిపించని నిర్మాత దానయ్య... మరీ అంత బిజీనా?

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో బాగా వినపడుతున్నటువంటి సినిమాలలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి.రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో రాంచరణ్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందినటువంటి ఈ సినిమా 2022 మార్చి 23న ప్రేక్షకుల ముందుపాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

 Reasons Behind Producer Dvv Danayya Not Attending Rrr Award Functions Details, P-TeluguStop.com

ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమా కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇప్పటివరకు ఎన్నో అవార్డులు వచ్చాయి.ఇలా ఫిలింఫేర్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ అంటూ ఎన్నో రకాల అవార్డులను అందుకుంది.ఇక ఈ అవార్డుల వేడుకలలో భాగంగా నిర్మాత దానయ్య మినహా మిగిలిన చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాని నిర్మించిన దానయ్య ఈ సినిమా అవార్డులలో పాల్గొనక పోవడానికి గల కారణం ఏంటి ఆయన మరి అంత బిజీగా ఉన్నారా లేక చిత్ర బృందం ఆయనని పక్కన పెట్టారా అనే వాదనలు కూడా వినపడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా అవార్డుల వేడుకలకు దానయ్య దూరంగా ఉండడానికి గల కారణాలను కూడా చిత్రబృందం వెల్లడించారు.నిజానికి నిర్మాత దానయ్య కాస్త ఇంట్రోవర్ట్ టైప్ కావడంతో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్స్ లో సైతం మాట్లాడడానికి తడబడిన పరిస్థితులు తలెత్తాయి.అందుకే అలాంటి అతనిని ఇతర దేశాలకు తీసుకెళ్లి వేదికలపై తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని భావించిన రాజమౌళి నిర్మాత దానయ్య బాధ్యతలను కూడా తన భుజాలపై వేసుకున్నారు.

అందుకే ఆయన ఇతర అవార్డు వేడుకలలో ఎక్కడా కనిపించలేదని అలాగే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి మరికొన్ని సినిమా పనులతో దానయ్య బిజీగానే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube