శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫిదా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది…ఈ సినిమాతో సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మంచి సినిమాలని సెలెక్ట్ చేసుకుంటూ వరుసగా సక్సెస్ లు కొడుతూ వచ్చింది.
అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాని మొదటగా హీరో మహేష్ బాబు తో చేద్దాం అనుకున్నారట కానీ అది వర్క్ ఔట్ అవ్వక వరుణ్ తేజ్ ని పెట్టీ తీశారు.అలా మహేష్ బాబు మంచి హిట్ సినిమాని మిస్ చేసుకున్నారనే చెప్పాలి… వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమాలో తనదైన క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులందరిని బాగా అలరించాడు అనే చెప్పాలి.ఇక సాయి పల్లవి వరుణ్ తేజ్ లా కాంబినేషన్ కూడా స్క్రీన్ పై బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి.
ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల నాగ చైతన్య తో తీసిన లవ్ స్టొరీ సినిమా లో కూడా సాయి పల్లవి గారే హీరోయిన్ గా చేశారు…అయితే మహేష్ బాబు చేయాల్సిన ఈ సినిమా తను ఎందుకు వదులుకున్నడంటే ఈ సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వల్లే మహేష్ బాబు ఈ సినిమా వడులుకున్నట్టు తెలుస్తుంది…