కోనసీమ జిల్లాలో ప్రమాదం జరిగింది.ఓఎన్జీసీ కేశనపల్లి జీసీఎస్ పైప్ లైన్ నుంచి మంటలు చెలరేగాయి.
మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓ వైపు మంటలు ఎగిసిపడుతుండగా మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది.వేడి పెరగడంతో తూర్పుపాలెం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.