ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.గొట్లగట్టు వద్ద ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు ఒంగోలులోని కమ్మపాలెం వాసులుగా గుర్తించారు.కాగా గిద్దలూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.