ఇటీవలే కాలంలో మోసపోవడానికి అమాయకులు దొరికితే చాలు కొందరు ప్రబుద్ధులు రెచ్చిపోయి మోసాలకు పాల్పడతారు.అమాయకుల బలహీనత దొరికితే చాలు ఏకంగా ఫుట్బాల్ ఆడేస్తారు.
చివరకు బెదిరించి ఏం చేస్తావో చేసుకో అంటూ తమ నిజస్వరూపాన్ని బయట పెడతారు.ఈ క్రమంలోనే ఓ డాక్టర్( Doctor ) ఆస్తిపై కన్నేసిన మోసగాడు తాను హైకోర్టు అడ్వకేట్( Advocate ) అంటూ ఆ కుటుంబానికి పరిచయం అయ్యి మొత్తం ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేశాడు.
వివరాల్లోకెళితే అనకాపల్లిలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు( Doctor Uma Maheshwara Rao ) కరోనా సమయంలో మృతి చెందారు.ఉమామహేశ్వరరావు పిల్లలు చదువులు, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటారు.
ఇది గమనించిన దొమ్మేటి రవితేజ అనే మోసగాడు ఉమామహేశ్వరి భార్య నాగరత్నం ను పరిచయం చేసుకొని తమ ఆస్తిని కాపాడతానంటూ నమ్మించాడు.నాగరత్నం కూడా భర్త చనిపోయాక ఆస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
పైగా కొడుకులు కూడా వేరే ప్రాంతాల్లో ఉండడంతో రవితేజ ను గుడ్డిగా నమ్మింది.

ఆస్తులన్నీ తమ పేరుపై ఉంటే ప్రాణహాని కలిగే అవకాశాలు ఉన్నాయని నాగరత్నం కు సూచించి, అనకాపల్లి మండలంలోని 3.37 ఎకరాల ఆస్తిని రవితేజ తండ్రి వెంకటరమణ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు.ఈ విషయం నాగరత్నం కొడుకు సాయి శశాంక్ కు తెలియడంతో రవితేజను గట్టిగా నిలదీశాడు.
రవితేజ 90 లక్షలు ఇస్తే తిరిగి తమకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని లేకపోతే లేదని చెప్పడంతో నాగరత్నం కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

ఇక ముందుగా 25 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తం రిజిస్ట్రేషన్ తర్వాత చెల్లిస్తాం అనడంతో రవితేజ తన తండ్రి వెంకటరమణ పేరుపై ఉన్న ఆస్తిని తిరిగి డాక్టర్ కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయించాడు.తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని రవితేజ డిమాండ్ చేయడంతో డాక్టర్ కుటుంబ సభ్యులంతా కలిసి తమకు జరిగిన మోసంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అవసరాల కోసం రవితేజ తమ కారు తీసుకుని తిరిగి ఇవ్వలేదని, డబ్బులు వెంటనే చెల్లించకుంటే కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు రేప్ కేసులు పెడతానని రవితేజ బెదిరించినట్లు డాక్టర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా రవితేజ, అతని స్నేహితులు నాగార్జున, మురళి ల వల్ల తమకు ప్రాణహాని ఉందని అనకాపల్లి ఎస్పీకి డాక్టర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.







