ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస కార్మికులు అత్యధికంగా ఉండే దేశం ఏదంటే గుక్క తిప్పుకోకుండా చెప్పొచ్చు గల్ఫ్ దేశాలని, ఈ గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా ప్రవాసులు కువైట్ వెళ్లేందుకు సుముఖత చూపుతుంటారు.అయితే అన్ని దేశాల మాదిరిగానే కువైట్ కూడా ప్రవాసుల కుటుంభ సభ్యులు కొంతకాలం వారితో గడిపేందుకు ఫ్యామిలీ విజిట్ వీసాలను ఆఫర్ చేస్తుంది.
అయితే కరోనా కారణంగా పూర్తిగా ఫ్యామిలీ విజిట్ వీసాలను పక్కన పెట్టిన కువైట్ తాజాగా మళ్ళీ ప్రవాసుల కోసం వీటిని జారీ చేసేందుకు సిద్దమయ్యింది.
దాదాపు రెండేళ్ళుగా నిలిచిపోయిన ఈ వీసా సేవలను తిరిగి ప్రారంభించడంతో ప్రవాస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం నాడు పునఃప్రారంభమైన ఈ వీసా సేవలను వినియోగించుకునేందుకు ఇప్పటికే ప్రవాసులు సిద్దమయ్యిపోయారు.ఈద్ కు ముందుగానే కువైట్ కరోనా నిభంధనలను సడలిస్తూ వీసాలపై ఆంక్షలు ఎత్తేయడంతో విజిట్ వీసాలకు పచ్చ జెండా ఊపింది.
గతంలోనే ఈ వీసాల విషయంలో రెసిడెన్సీ అఫైర్ డిపార్ట్మెంట్ మే నెలలో వీసాల జారీను అమలు చేస్తామని ప్రకటించగా అన్నట్టుగానే తాజాగా మే నెలలోనే ఈ వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించింది.
ఇదిలాఉంటే ఈ వీసాల జారీ విషయంలో ప్రత్యేకించి కొత్త నిభందనలు ఏమీ అమలు చేయలేదని వీసా పొందేందుకు పాత నిభందనలు ఏవైతే ఉన్నాయో అవే వర్తిస్తాయని వీసా రెసిడెన్సీ విభాగం ఓ ప్రకటనలో జారీ చేసింది.
అసలు ఫ్యామిలీ వీసాకు ఎలాంటి షరతులు ఉంటాయంటే.కువైట్ లో ఉండే ప్రవాసుడు తన భార్య, 16 ఏళ్ళ లోపు పిల్లలకు మాత్రమే ఈ ఫ్యామిలీ విజిట్ వీసా జారీ చేయబడుతుంది.వర్క్ పర్మిట్ లో 1.23 లక్షలు ఉన్నవారికి మాత్రమే ఫ్యామిలీ వీసా పొందేందుకు అర్హులు.దాదాపు రెండేళ్ళ కాలం తరువాత కువైట్ మళ్ళీ ఫ్యామిలీ విజిట్ వీసా ప్రక్రియను ప్రారంభిచడంతో ఎంతో మంది ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.