వివాహేతర సంబంధం స్థిరాస్తి గొడవల నేపథ్యంలో ఓ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.కారుతో సహా దహనం చేశారు.
ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామం యశ్వంతరావు పేట రెవిన్యూ పరిధిలో దారుణ హత్య జరిగింది.
తగలబెట్టేసిన హోండా సిటీ కారు.డిక్కీలో కనిపించిన శవం కలకలం రేపింది.
డిక్కీలో పెట్టి కారు తగలబెట్టార లేక సజీవ దహనం చేశార అనేది తెలియలేదు.ఎక్కడో హత్య చేసి మంగళపర్తి శివారులో కారుతో పాటు దహనం చేసినట్లుగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
కారు రిజిస్ట్రేషన్ నెంబర్(టిఎస్ 15హెచ్4005 నెంబర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.ఈ నెంబర్ ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి మెదక్ పట్టణానికి చెందిన బిజెపి నేత ధర్మకార్ శ్రీనివాస్(47) గా గుర్తించారు.
తన భర్త సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బయటకు వెళ్లారని కొద్దిసేపటి తర్వాత ఆయన సెల్ ఫోన్ చేయగా కలవలేదని శ్రీనివాస్ భార్య పోలీసులకు తెలిపారు.
తన భర్తకు ఇతర మహిళలతో సంబంధం ఉందని వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచూ గొడవలు జరిగేవి అని చెప్పింది.
తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని తరుచూ తనతో గొడవ పడేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నరు.ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.శ్రీనివాస్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.మృతదేహం గుర్తించడం కష్టమైంది.
మృతదేహం పూర్తిగా కాలి పోయి ఉండటం శరీరంపై ఆనవాళ్లు కూడా సరిగ్గా కనిపించకపోవడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు.శ్రీనివాస్ కు కృత్రిమ దంతాలు( పెట్టుడు పళ్ళ) ఉంటాయని కుటుంబ సభ్యులు చెప్పడంతో వైద్య సిబ్బంది గుర్తించి చనిపోయింది శ్రీనివాస రావు అని నిర్ధారించారు.
ఈ హత్య కేసులో త్వరలో చేయిస్తాధిని తూప్రాన్ డీఎస్పీ కుమార్ చెప్పారు అంతేగాని పట్టుకోడానికి నాలుగు గంటలకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు శ్రీనివాస్ హత్య చేసి ఉంటారని చెప్పారు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందన్నారు.