ఎగ్జైటింగ్ న్యూస్ చెబుతానన్న నోయల్.. పెళ్లి గురించేనా..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4లో పాల్గొని అనారోగ్య సమస్యల వల్ల హౌస్ నుంచి నోయల్ బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే.కుమారి21ఎఫ్, ఈగ సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించి పాపులారిటీని సంపాదించుకున్న నోయల్ సింగర్ గా కూడా ప్రేక్షకులకు సుపరిచితం.అయితే హీరోయిన్ ఎస్తర్ నోయల్ ప్రేమించి పెళ్లి చేసుకోగా కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు.అయితే విడిపోయిన తరువాత కెరీర్ పరంగా వేర్వేరుగా ఇద్దరూ బిజీ అవుతున్నారు
.

 Exciting-news-will-tell-noel-about-marriage, Biggboss, Tollywood , Noyal , About-TeluguStop.com

కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన తరువాత నోయల్, ఎస్తర్ తమ విడాకుల గురించి వెల్లడించారు.బిగ్ బాస్ హౌస్ లో నోయల్ టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలుస్తారని ఆయన అభిమానులు భావించినా ఊహించని విధంగా నోయల్ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

హౌస్ లో వివాదాలకు దూరంగా అందరితో మంచిగా మెలిగిన నోయల్ కు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది.

Telugu Marrege, Biggboss, Eega, Kumari, Noyal, Sensational, Tollywood-Movie

అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా లేని నోయల్ తాజాగా ఎగ్జైటింగ్ న్యూస్ చెబుతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.అభిమానులతో ఆ విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నానని తనకు చాలా ఆత్రంగా ఉందని నోయల్ చెప్పుకొచ్చారు.అయితే నెటిజన్లలో ఎక్కువమంది నోయల్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని అందుకు సంబంధించి అప్ డేట్ ఇవ్వనున్నారని అభిప్రాయపడుతున్నారు.

Telugu Marrege, Biggboss, Eega, Kumari, Noyal, Sensational, Tollywood-Movie

అయితే మరి కొందరు నెటిజన్లు మాత్రం నోయల్ కొత్త సినిమా గురించి ప్రకటన చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.నోయల్ చెప్పేవరకు ఆగితే మాత్రమే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.నోయల్ ఇచ్చే అప్ డేట్ కొరకు అతని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube