అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నాగిని-3 హీరో

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్రీలీలో మీటూ ఉద్యమం ఎంత తీవ్రతరంగా జరిగిందో అందరికి తెలిసిందే.

నటులు, దర్శక, నిర్మాతల లైంగిక వేధింపులపై చాలా మంది నటీమణులు తమ గళం విప్పారు.

కొంత మంది అయితే మరో అడుగు ముందుకి వేసి తమని వేధించిన వారి పేర్లు కూడా బయట పెట్టారు.దీంతో మీటూ ఉద్యమం అనేది ఇండియాలో కూడా సెన్సేషన్ అయ్యింది.

సెలబ్రిటీల ముసుగులో చాలా మంది నటులు చేసే ఘోరాలు బయటకొచ్చాయి.దీంతో చిత్ర పరిశ్రమ మీద ఉన్న ఒక దురాభిప్రాయం మరింత స్ట్రాంగ్ అయ్యింది.

అలాగే టెలివిజన్ రంగంలో కూడా చాలా మంది నటీమణులు వేధింపులని ఎదుర్కొంటూ ఉన్నారని కూడా టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే అప్పుడప్పుడు కొందరు నటుల మీద ప్రేమ పేరుతో మోసం చేసాడని, అలాగే వాడుకొని వదిలేసాడని కొంత మంది పోలీసులకి ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Advertisement

ఇందులో చాలా వరకు వాస్తవం అని విషయాలు కూడా బయటకొచ్చాయి.నటుల వేధింపులు, మోసం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే హిందీలో నాగిని3 సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు l ఓ బాలిక అత్యాచారం కేసు పెట్టింది.దీంతో ముంబై మాల్వానీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

అతనితో పాటు మరో ఐదుగురు తనని ఓ కారులో పెట్టి అత్యాచారం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది.అయితే ఈ అత్యాచారం జరిగింది గతంలో అని తెలుస్తుంది.

బాలిక ఫిర్యాదుతో ఈ నటుడుతో పాటు మరో ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు