రాత్రి పూట ఈ ఆలయంలో అడుగు పెడితే ప్రాణాలు దక్కవట... ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు? వారి మనసు బాగా లేకపోతేనో లేదా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మన మనసుకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరు ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని కాసేపు ఆలయ ప్రాంతంలో ఉండి ఇంటికి చేరుకుంటారు.మరికొందరు స్వామివారి దర్శనార్థం అక్కడే ఉండి ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజు ఇంటికి వస్తారు.

 Facts About Maihar Wali Mata Temple, Wali Mata Temple, Maihar, Madhya Pradesh, P-TeluguStop.com

సాధారణంగా అన్ని ఆలయాలలో కూడా భక్తులు ఈ విధంగా స్వామివారికి పూజలు చేస్తుంటారు.కానీ ఒక దేవాలయం లోకి వెళ్తే మాత్రం మనం ప్రాణాలతో బయటపడలేమనే విషయం మీకు తెలుసు.

వినడానికి ఆశ్చర్యంగా భయంకరంగా ఉన్న ఇది నిజం.ఈ ఆలయంలోకి రాత్రిపూట భక్తులు పొద్దునకి వారు ప్రాణాలతో కాకుండా వారి శవం బయటకు వస్తుంది.

ఇంతకీ ఇటువంటి ఆలయం ఎక్కడ ఉంది ?ఆలయ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ యొక్క త్రికూట కొండ మీద ఉంది.త్రికూట పర్వతం మీద కొండల మధ్య మైహర్ వాలి మాతా ఆలయం ఉంది.51 శక్తి పీఠాలలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు.ఈ ఆలయ దర్శనార్థం ఏటా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.కానీ చీకటి పడగానే ఈ ఆలయ ప్రాంతంలో ఒక్కరు కూడా ఉండరు.ఒకవేళ ఎవరైనా అక్కడే ఉండిపోతే మరుసటి రోజు వారి ప్రాణాలతో తిరిగిరారు.రాత్రిపూట ఈ ఆలయంలో ప్రవేశించే వారికి తప్పకుండా మరణం సంభవిస్తుందని అక్కడి ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు.

ఈ విధంగా గుడిలోకి వెళ్ళిన వారు ఎందుకు చనిపోతారు అనే విషయం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

Telugu Madhya Pradesh, Maihar, Pooja-Telugu Bhakthi

పురాణాల ప్రకారం ఆల‌హ‌, ఉద‌మ్ అనే ఇద్ద‌రు సోద‌రుల‌ మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారి ఆలయాన్ని గుర్తించి, అమ్మవారికి పూజలు చేసేవారు.అయితే వీరిద్దరూ చనిపోవడం వల్ల ఆత్మలు గుడిలోనే తిరుగుతుంటాయని రాత్రిపూట ఈ ఆత్మలో ఆలయంలోకి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తుంటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.ఈ క్రమంలోనే రాత్రిపూట ఎవరైనా ఆలయంలోకి వెళితే వారికి తప్పకుండా మరణం సంభవిస్తుందని, అందుకోసమే ఈ చీకటి పడగానే ఆలయ ద్వారం మూసి వేసి భక్తులెవరు ఉండకుండా కొండ పై నుంచి కిందికి వస్తారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

అయితే ప్రతి ఏడాది ఉత్సవాలలో భాగంగా అమ్మవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube