ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వెళ్లారు.ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ తో( CM Jagan ) సమావేశం అయ్యారు.
అయితే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ తో భేటీ అయిన నేపథ్యంలో ఆయన వైసీపీలో( YCP ) చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందులో భాగంగానే భేటీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
దీనిపై క్లారిటీ రావాల్సి ఉండగా.వైసీపీ అధిష్టానం కీలకంగా చేస్తున్న మార్పులు చేర్పుల్లో భాగంగా రావెల కిశోర్ బాబును ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా( Prathipadu YCP Incharge ) నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ వ్యవహారిస్తున్నారన్న సంగతి తెలిసిందే.