మన టాలీవుడ్ సెలబ్రిటీల ఇంస్టాగ్రామ్ సంపాదన ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలు అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 Do You Know How Much Rashmika Vijay Deverakonda Earns By Putting A Single Post O-TeluguStop.com

ఇలా సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేయడంతో వీరిని అనుసరించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది .ఇలా ఒక్కో సెలెబ్రెటీ మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు.ఇక సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కేవలం వారి వ్యక్తిగత విషయాలను మాత్రమే షేర్ చేస్తున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే.సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి వారికి సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ పోస్టులు చేస్తూ ఉంటారు.

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చేసే ఒక్క పోస్ట్ ద్వారా భారీ స్థాయిలోనే సంపాదన కూడా అందుకుంటున్నారని తెలుస్తోంది.మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎంత మొత్తంలో సంపాదిస్తున్నారనే విషయానికి వస్తే.

రష్మిక: నేషనల్ క్రష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక( Rashmika )పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఏదైనా ఒక పోస్ట్ చేశారు అంటే సుమారు 30 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం.

Telugu Kajal Agarwal, Mahesh Babu, Pooja Hedge, Samantha, Tollywood-Movie

సమంత: సోషల్ మీడియాలో సమంత( Samantha ) కు సుమారు 30 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.ఇలా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సమంత ఇంస్టాగ్రామ్ లో ఏదైనా ఒక పోస్ట్ చేశారు అంటే 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారట.

Telugu Kajal Agarwal, Mahesh Babu, Pooja Hedge, Samantha, Tollywood-Movie

కాజల్ అగర్వాల్: సీనియర్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేస్తే 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.

పూజా హెగ్డే: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి పూజ హెగ్డే ( Pooja Hedge ) సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈమె కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే సుమారు 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం.

Telugu Kajal Agarwal, Mahesh Babu, Pooja Hedge, Samantha, Tollywood-Movie

మహేష్ బాబు: సౌత్ ఇండస్ట్రీలో మహేష్ బాబు( Mahesh Babu ) కి ఉన్నటువంటి క్రేజ్ మామూలుగా లేదు ఈయన సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో ఎండార్స్మెంట్ వీడియోలు చేస్తూ భారీ స్థాయిలో వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఏదైనా ప్రమోట్ చేస్తే సుమారు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం.

Telugu Kajal Agarwal, Mahesh Babu, Pooja Hedge, Samantha, Tollywood-Movie

విజయ్ దేవరకొండ: రౌడీ హీరో ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ దానిని ప్రమోట్ చేస్తే కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube