వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.మంత్రి అంబటితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మట్టి, గ్రావెల్ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
పోలవరం కుడి కాలువ కేంద్రంగా జరిగిన మట్టి, గ్రావెల్ తవ్వకాలు, రవాణా, అమ్మకాలపై సీఎం జగన్ నోరు విప్పాలన్నారు.మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నది ఎంతని ప్రశ్నించారు.
అంబటి, వసంతకృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీ, నందిగం సురేశ్ ఇప్పటివరకు కొట్టేసింది ఎంతని నిలదీశారు.కోర్టు ఆదేశాలను కాదని మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన మంత్రి అంబటి, సీఎంతో పాటు వివిధ శాఖల అధికారులు అందరూ శిక్షార్హులేనని స్పష్టం చేశారు.