ప్రతి ఒక్కరూ అదే ప్రశ్న వేస్తున్నారు.. అసహనం వ్యక్తం చేసిన సీతారామం బ్యూటీ?

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ రాకూర్.ఈమె సినిమాలపై మక్కువతో మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం పలు సీరియల్స్ లో నటించి సినిమా అవకాశాలను అందుకున్నారు.

 Everyone Is Asking The Same Question Sitaramam Heoine Mrunal Thakur Details, Sit-TeluguStop.com

హిందీలో మరాఠీలో పలు సినిమాలలో నటించిన ఈమె తెలుగులోకి సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమె పేరు ఒక్కసారిగా మారు మోగిపోతుంది.ఈ సినిమాలో సీత పాత్రలో నటించి చూడ చక్కని అందంతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను షాక్ కి గురి చేస్తున్నారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Telugu Dulquer Salman, Mrinal Thakur, Mrunalthakur, Sitarams, Sitaramam-Movie

తను సీతారామం వంటి అద్భుతమైన సినిమాను ఇప్పటివరకు హిందీలో కూడా నటించలేదని ఈమె వెల్లడించారు.కొంతమంది దర్శకులు తనపై ఉన్న నమ్మకంతో తనకు ఇలాంటి సినిమా అవకాశాలను కల్పిస్తున్నారని వెల్లడించారు.ఇకపోతే తనకు అభిమానుల నుంచి ఒక ప్రశ్న ఎదురవుతూ ఉందని చాలామంది తన వయసు గురించి తనను ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ తనకు ప్రస్తుతం 30 సంవత్సరాలు అంటూ తన వయసు గురించి తెలియజేశారు.తెలుగులో ఈమె నటించిన ఈ సినిమా మంచి హిట్ కావడంతో తనకు తదుపరి అవకాశాలు కూడా వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube