చంద్రమోహన్ చనిపోయిన ఆ విషయంలో కింగ్... ఈయనకు ఎవరు సాటిరారుగా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చంద్రమోహన్( Chandra Mohan ) ఒకరు.ఈయన దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినట్టుగా గుర్తింపు పొందారు.

 Even If He Dies Chandra Mohan Raje A Lucky, Chandra Mohan, Tollywood, Nagarjuna-TeluguStop.com

ఈయన హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ( Character artist )గా కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.ఒకానొక సమయంలో తండ్రి పాత్రలలో నటించాలి అంటే చంద్రమోహన్ అందరికీ గుర్తుకు వచ్చేవారు అలా తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు చంద్రమోహన్.

ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అవార్డులు పురస్కారాలు సొంతం చేసుకున్నటువంటి చంద్రమోహన్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందారు.ఇలా ఈయన సినీ కెరియర్లో సుమారు 900కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు.

అయితే వయసు పై పడటంతో సినిమాలకు దూరంగా ఉన్నటువంటి చంద్రమోహన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం ఉదయం హైదరాబాదు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ విధంగా చంద్రమోహన్ మరణ వార్త తెలిసి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.

ఇక ఈయన మరణ వార్త తెలియడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చి ఆయనను చివరిసారిగా చూస్తూ నివాళులు అర్పిస్తున్నారు.అదేవిధంగా చంద్రమోహన్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

ఇక చంద్రమోహన్ మరణించడంతో ఆయనకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Chandra Mohan, Chandramohan, Nagarjuna, Tollywood-Movie

ఇక చంద్రమోహన్ మరణించినప్పటికీ ఒక విషయంలో మాత్రం ఈయన చాలా గ్రేట్ అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.చంద్రమోహన్ సినీ కెరీర్లు దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగారు.సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత సెలబ్రిటీల( Celebrities ) గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి.

హీరోయిన్లతో ప్రేమ ప్రయాణాలు కొనసాగించడం పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలవడం ఇలా ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.చంద్రమోహన్ మాత్రం ఇన్ని సంవత్సరాల పాటు సినిమా కెరియర్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి రూమర్లను ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు.

Telugu Chandra Mohan, Chandramohan, Nagarjuna, Tollywood-Movie

ఇన్నేళ్ల తన సినీ కెరియర్ లో ఎప్పుడు కూడా హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించారన్న వార్తలు రాలేదు.అలాగే ఇతరులతో వివాదాలకు వెళ్తారు అన్నటువంటి వార్తలు కూడా ఈయన గురించి ఎప్పుడు రాలేదు.ఈయన సినిమా షూటింగ్ లలో పాల్గొంటే కనుక ఇతర సెలబ్రిటీలతో చాలా సంతోషంగా సరదాగా ఉండేవారని, ప్రతి ఒక్కరిని కలుపుకొనిపోయే తత్వం చంద్రమోహన్ గారిది అంటూ ఎంతో మంది సెలెబ్రెటీలు ఈయన మంచితనం గురించి తెలియజేశారు.ఇలా తన సినీ కెరియర్లో ఒక్క నెగిటివ్ మార్కు కూడా లేనటువంటి నటుడిగా చంద్రమోహన్ గుర్తింపు సంపాదించుకున్నారు అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube