ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.అనేక సంస్థలు తమ కార్యాలయాలను, తయారీ ప్లాంట్‌లను భారత్‌లో నెలకొల్పేందుకు యోచిస్తున్నాయి.
కోవిడ్ వల్ల తలెత్తిన సంక్షోభానికి భారత ఆర్ధిక వ్యవస్ధ తట్టుకుని నిలబడటం కూడా ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత్‌కు పెట్టుబడులు పోటెత్తుతాయని అనేక సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ .రాబోయే రెండేళ్లలో భారత్, ఆగ్నేయాసియాలలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది.టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, కన్జ్యూమర్ సహా దాదాపు 15 కంపెనీలతో తాము చర్చలు జరుపుతున్నామని భారత్, ఆగ్నేయాసియాలో జనరల్ అట్లాంటిక్ వ్యాపార అధిపతి సందీప్ నాయక్ తెలిపారు.
భారత్‌లో స్టార్టప్‌ల మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.2021లో రికార్డు స్థాయిలో 35 బిలియన్ నిధులను సేకరించిన తర్వాత వ్యవస్థాపకులు మరింత నగదును ఆకర్షించడానికి కష్టపడుతున్నారు.దీని వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వస్తోంది.2021లో భారతీయ స్టార్టప్‌లలో కేవలం 190 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు దావోస్‌లోని స్విస్ స్కీ రిసార్ట్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్World Economic Forumలో ఓ ఇంటర్వ్యూలో నాయక్ తెలిపారు.ప్రధానంగా భారత్, ఇండోనేషియా, వియత్నాంలపై తాము దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు.
జనరల్ అట్లాంటిక్ … భారత్‌లో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులలో బైజూస్ వంటి ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలు వున్నాయి.ఇంటర్నెట్ , స్మార్ట్‌ఫోన్ వినియోగం విజృంభిస్తున్న మనదేశంలో బైజూస్ ఆన్‌లైన్ ట్యూటరింగ్ సేవలను అందిస్తోంది.
దీని మార్కెట్ విలువ దాదాపు 22 బిలియన్ డాలర్లు.దీనితో పాటు భారత్‌లో అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్‌లో కూడా జనరల్ అట్లాంటిక్ పెట్టుబడి పెట్టింది.
ఇండినేషియా విషయానికి వస్తే.ఆ దేశంలో పుడ్ అండ్ డ్రింక్స్ రిటైలర్ పీటీ మ్యాప్ బోగా అడిపెర్కాసా, ఫిలిప్పీన్స్‌లోని సామాజిక వినోద వేదిక కుములో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు వున్నాయి.
ఇకపోతే.జనరల్ అట్లాంటిక్ వైస్ ఛైర్మన్‌గా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో, భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా 165కి పైగా వున్న సంస్థలకు అజయ్ బంగా సారథ్యంలోని కంపెనీ సలహాలు ఇస్తుంది.