కిక్కిరిసిన రైలులో అమ్మాయిల ఎనర్జటిక్ డ్యాన్స్‌.. వీడియో వైరల్!

ఇన్‌స్టా రీల్ చేయడానికి చాలా మంది ఉత్సాహపడుతుంటారు. రైలు,( Train ) బస్సు, పార్కు, రోడ్డు, ఇతర రద్దీ ప్రదేశాల్లో యువతీయువకులు రీల్స్ చేస్తున్నారు.

 Energetic Dance Of Girls In A Crowded Train.. Video Viral, Train, Dance, Vi-TeluguStop.com

ఈ వీడియోల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారు కొందరున్నారు.ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తూ, చుట్టు ఉన్న వారిని పట్టించుకోకుండా చాలా మంది వీడియోలు చేస్తున్నారు.

ఇదే కోవలో రైలులో ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో( Video ), రైలులోని కోచ్ లోపల ఇద్దరు అమ్మాయిలు భోజ్‌పురి పాటలపై డ్యాన్స్ చేస్తున్నారు.తొలుత ఓ యువతి భోజ్‌పురి పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేసింది.చివరిలో ఆమెకు మరో యువతి జత కలిసింది.వారిద్దరూ చాలా ఎనర్జటిక్‌గా డ్యాన్స్ చేశారు.స్టెప్పులతో అదరగొట్టేశారు.ఈ వీడియోను జయజెర్రీ అనే ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

ఆమె బయోలో డ్యాన్సర్ అని ఉంది.భోజ్‌పురి మరియు హిందీ పాటలపై డ్యాన్స్ వీడియోలతో సహా రైలులో డ్యాన్స్ చేసిన అనేక వీడియోలు షేర్ చేయబడ్డాయి.

ఓ వైపు ఈ వీడియోను ప్రశంసించే వారితో పాటు విమర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.యువతుల తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఇతరుల ఇబ్బందిని పట్టించుకోకుండా రద్దీగా ఉన్న రైలులో డ్యాన్స్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.ఇటీవల కాలంలో ఇలా చేయడం యువతులకు ఫ్యాషన్ అయిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.‘ఇలాంటి వారిపై రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలి.లేకపోతే రేపు కొత్త వ్యక్తులు వాటిని చూసి వీడియోలు చేయడం ప్రారంభిస్తారు’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

ఇంతకు ముందు కూడా రైలులో చాలా డ్యాన్స్ వీడియోలు వైరల్( Dance video ) అయ్యాయి.ఈ తరహాలో ఇతరులకు అసౌకర్యం కలిగించే చర్యలను యువత మానుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube