1975లో ఎమరెన్సీ విధించడం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రకే మాయని మచ్చగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ.జీ 7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ వచ్చిన ఆయన ఆదివారం మ్యూనిచ్‌లో భారతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఎమర్జెన్సీ కాలంలో ప్రతి భారతీయుడి డీఎన్ఏలో వున్న ప్రజాస్వామ్యాన్ని తుంగతో తొక్కి, అణచివేశారని మోడీ అన్నారు.ఏళ్ల క్రితమే ఈ కుట్రలకు ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పారని ప్రధాని గుర్తుచేశారు.
ఎక్కడ వున్నా భారతీయులుగా మన దేశ ప్రజాస్వామ్యాన్ని చూసి గర్విస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
అలాగే భారతదేశ ఖ్యాతిని విస్తరించడంలోనూ, భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించడంలోనూ ప్రవాసుల సహకారాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు.
ఇదే సమయంలో ప్రస్తుత భారతదేశ వృద్ధిని ఆయన హైలైట్ చేశారు.దేశాభివృద్ధికి సంబంధించిన ఎజెండాను ఆయన ప్రస్తావించారు.
గత శతాబ్ధంలో జర్మనీ సహా ఇతర దేశాలు 3వ పారిశ్రామిక విప్లవం నుంచి ప్రయోజనం పొందాయని.కానీ భారత్ అప్పట్లో బానిసగా వుండటం వల్ల ఆ ప్రయోజనాలు పొందలేకపోయిందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు 4వ పారిశ్రామిక విప్లవంలో భారత్ వెనుకబడి వుండదని.ఈ విషయంలో ప్రపంచానికే నాయకత్వం వహిస్తోందని ప్రధాని తెలిపారు.
ఇంత విశాలమైన, వైవిధ్యభరితమైన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అందజేస్తుందో భారత్ చూపించిందని మోడీ అన్నారు.
కోట్లాది మంది భారతీయులు పెద్ద లక్ష్యాలను సాధించిన తీరు అపూర్వమైనదన్న ఆయన.నేడు దేశంలో ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా వుందన్నారు.99 శాతం గ్రామాలలో విద్యుత్తు, స్వచ్ఛమైన వంట ఇంధనం అందుబాటులో వుందని ప్రధాని గుర్తుచేశారు.భారత్ గడిచిన రెండేళ్ల నుంచి 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తోందని తెలిపారు.భారత్‌లో ప్రతి పదిరోజులకు ఒక ‘యూనికార్న్’ (ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ విలువ $ 1 బిలియన్ ఉన్నట్లయితే దానిని ‘యూనికార్న్’ అని పేర్కొంటారు) అవతరిస్తోందని ప్రధాని చెప్పారు.
ఇండియాలో ప్రతి నెలా సగటున 5000 పేటెంట్లు దాఖలవుతున్నాయని.ప్రతి నెలా సగటున 500కు పైగా రైల్వే కోచ్‌లను తయారు చేస్తున్నామని, 18 లక్షల ఇళ్లకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని మోడీ తెలిపారు.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ఇండియాదేనని.అలాగే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించామని ఆయన గుర్తుచేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో డ్రోన్‌లను ఉపయోగించి ఎరువులు పిచికారీ చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.
ఐటీలో, డిజిటల్ టెక్నాలజీలో భారత్ తన ఉనికిని చాటుకుంటోందని.
ప్రపంచంలో 40 శాతం డిజిటల్ లావాదేవీలు భారత్ నుంచి జరుగుతున్నాయని మోడీ తెలిపారు.భారత్‌లో టీకాలు వేయాలంటే పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుందని కొందరు చెప్పారని.కానీ మనదేశంలో 90 శాతం మంది పెద్దలు రెండు డోసుల వ్యాక్సిన్ .95 శాతం మంది కనీసం ఒక డోస్ తీసుకున్నారని ప్రధాని చెప్పారు.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన వేళ.భారత్ ఇప్పుడు కొత్త కలలు కంటోందని, కొత్త లక్ష్యాలను ఏర్పరుస్తోందని.వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తోందని మోడీ పేర్కొన్నారు.సంకల్ప్ నుంచి సమృద్ధి దిశగా భారత్ పయనిస్తోందని ప్రధాని చెప్పారు.