Elections Schedule : నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల … హోరాహోరీగా పోరు

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్( Elections Schedule ) విడుదల కానుంది.దేశవ్యాప్తంగా పార్లమెంట్, ఏపీతో సహా నాలుగు అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.

 Elections Schedule : నేడు ఎన్నికల షెడ్యూల్-TeluguStop.com

ఎన్నికల సంఘంలో కొత్తగా ఇద్దరు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటికే వారు దేశవ్యాప్తంగా ఎన్నికల సంసిద్ధత పైన సమీక్ష నిర్వహించారు .ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.ఏపీలో మొదటి విడత లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది.

దీంతో రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారం మొదలు కానుంది.

లోక్ సభ తో పాటు,  ఏపీ,  ఒడిస్సా , అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది.

అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు కమిషనర్లు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు.

కొద్ది నెలలుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ,  సమస్యత్మక ప్రాంతాలను గుర్తించారు.ఈవీఎల తరలింపు , భద్రతా దళాల మోహరింపు , సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం వంటి విషయాలపై అనేక సూచనలు చేశారు.

Telugu Ap, Central, Cm Jagan, Congress, Schedule, Jagan, Janasena, Kishan Reddy,

ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి .ఏపీలో( AP ) తొలి విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి.2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది .మార్చి 18 న నోటిఫికేషన్ జారీ అయింది.ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది.మే 23న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి .అయితే ఈసారి మార్చి 16న షెడ్యూల్ విడుదల అవుతోంది.ఏపీలో ఏప్రిల్ 25 మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఏపీలో మొదటి విడతలోనే 175 అసెంబ్లీ , 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.2019 ఎన్నికల్లో తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించారు.ఇప్పుడు అదేవిధంగా జరిగే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు.

Telugu Ap, Central, Cm Jagan, Congress, Schedule, Jagan, Janasena, Kishan Reddy,

ఏపీలో టిడిపి , బిజెపి , జనసేన పార్టీలు( TDP BJP Janasena ) కూటమిగా ఏర్పడ్డాయి.వైసీపీని( YCP ) ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఎన్నికల్లో ఒంటరిగానే తమ రాజకీయ ప్రత్యర్థులు అందరినీ ఎదుర్కొంటామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈరోజు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) తమ పార్టీ ఎంపీ , ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ జాబితాను అధికారికంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రకటించనున్నారు.ఇప్పటికే టిడిపి , జనసేన, బిజెపిలు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఒక కొలిక్కి వచ్చాయి .పూర్తిస్థాయిలో మూడు పార్టీలు తమ అభ్యర్థుల ఫైనల్ జాబితాను ప్రకటించనున్నాయి.దీంతో ఇక అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేసి,  ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ లభించే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube