ఏపీలో రానున్న ఎన్నికలకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.వైసీపీని ప్రతిపక్ష పార్టీలు ఏం చేయలేవని తెలిపారు.
అయితే, ఏపీలో వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని టీడీపీ, జనసేనలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చినట్లుగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.