అంతకు ముందు.ఆ తరువాత సినిమా అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ పిల్ల ఇషా రెబ్బ.
నటిగా మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి తరువాత మంచి అవకాశాలు వచ్చాయి.అలాగే ఆమె చేసిన చాలా సినిమాలు హిట్ టాక్ కూడా తెచ్చుకున్నాయి.
మంచి నటిగా గుర్తింపు కూడా వచ్చింది.అయిన ఈ భామకి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
తెలుగమ్మాయిగా తెలుగు సినిమాలతో సత్తా చాటాలని స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశించిన ఈ భామకి తెలుగమ్మాయి అనే గుర్తింపు పెద్ద అడ్డంకిగా మారింది.దీంతో ఆమెకి చాలా వరకు రొటీన్ క్యారెక్టర్స్ వచ్చాయి.
ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో ఇషా రెబ్బకి అవకాశం వచ్చింది.అయితే త్రివిక్రమ్ సినిమాలలో ఎ మాత్రం ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ పాత్రలో ఇషా రెబ్బ నటించడంతో అది సూపర్ హిట్ అయిన ఆమెకి మాత్రం ప్లస్ కాలేదు.ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్ళకి పైగా అయిపోవడంతో ఈ భామ తన రూట్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకి, ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉన్న ఇషా ట్రెండ్ కి తగ్గట్లు తన అందాలు కూడా చూపించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
అందులో భాగంగానే ఈ మధ్య ఇషా రెబ్బ వరుసగా బోల్డ్ ఫోటో షూట్ లతో దర్శకులకి ఏర వేస్తుంది.ఇన్ని రోజులు దాచుకున్న అందాలని చూపించడానికి రెడీ అయిన తెలుగు అమ్మాయికి మన దర్శకులు ఎ స్థాయిలో అవకాశాలు ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.