20 నిమిషాలలో ఫుల్ ఫినిష్ చేస్తే 20 వేలు... కానీ చివరకు...?

స్నేహితులు అందరూ కలిసి వేసుకున్న పందెం లో ఓ నిండు ప్రాణం బలి అవ్వాల్సి వచ్చింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఈ సంఘటన తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చందా మండలంలో చింతల చందా లో చోటు చేసుకుంది.

 Man Dies After Drinking Bottle In 20 Minutes, Boozing Bet , Drinking Bottle, Be-TeluguStop.com

ఆ గ్రామంలో ప్రకాశం జిల్లాకు చెందిన రసూల్ అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఇకపోతే తాజాగా రసూల్ అతనితోపాటు, ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం సేవించాలని అనుకున్నారు.

ఈ సందర్భంగా మందు తాగుతున్న సమయంలో రసూల్ స్నేహితులు నాగూర్, రత్తయ్యలు అతనికి 20 నిమిషాల్లో ఫుల్ బాటిల్ మద్యం సేవిస్తే 20000 ఇస్తామని పందెం వేసుకున్నారు.

ఈ పరిస్థితుల్లో సవాలును స్వీకరించిన రసూల్ తన స్నేహితులు చెప్పిన విధంగా 20 నిమిషాల్లో గుక్క తిప్పకుండా ఫుల్ బాటిల్ ను ఖాళీ చేశాడు.

అప్పటి వరకు బాగానే ఉన్న రసూల్ ఫుల్ బాటిల్ తాగడంతో పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.అతడిని వదిలేసి మిగతా ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే రసూల్ ఎంతసేపటికి మద్యం మత్తులో నుంచి బయటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతనిని వెంటనే చికిత్స నిమిత్తం హాస్పటల్ కు తరలించగా, అప్పటికే రసూల్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారణ చేశారు.దీంతో రసూల్ స్నేహితులైన రత్తయ్య, నాగూర్ భాషలపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు అందించడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube